Reading Time: < 1 minute

IPL 2026: పంజాబ్ చేతిలో గుజరాత్ ఓటమి.. గిల్ కెప్టెన్సీపై అనిల్ కుంబ్లే అసహనం.. 

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌ను గుజరాత్ టైటాన్స్ ఓటమితో ప్రారంభించింది. మార్చి 31న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత సీజన్ లో పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను 13వ ఓవర్ వరకు బౌలింగ్‌కు దించకపోవడంపై టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌ను 13వ ఓవర్ వరకు వేచి చూడటం విడ్డూరంగా ఉంది. తొలి బంతికే వికెట్ రావడం కలిసొచ్చిన అంశం, కానీ అంత క్వాలిటీ బౌలర్‌ను అటాకింగ్‌కు ముందే ఉపయోగించాల్సిందని విమర్శించారు. మరోవైపు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం గిల్ కెప్టెన్సీని మెచ్చుకున్నారు. ముఖ్యంగా గిల్ పెట్టిన ‘షార్ట్ లెగ్’ ఫీల్డింగ్ సెటప్ తనను ఆశ్చర్యపరిచిందని, కెప్టెన్లు ఇలా అటాకింగ్ మైండ్‌సెట్‌తో ఉండటం మంచిదని పేర్కొన్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 162 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38), గ్లెన్ ఫిలిప్స్ (25) మినహా మిగతా బ్యాటర్లు అందరూ విఫలంకావడంతో పాటు ఏ బ్యాటర్ కూడా కనాసీం 150 + స్ట్రైక్ రేట్‌తో ఆడలేకపోవడం జట్టుకు మైనస్‌గా మారింది. 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ బౌలర్లు విఫలమయ్యారు. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోల్పోయిన గిల్, ఈ సీజన్‌లో తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీని కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో కూపర్ కాన్నోలీ (720 అద్భుతమైన హాఫ్ సెంచరీ చేయగా, ప్రభ్ సిమ్రాన్ సింగ్ (37)  ప్రదర్శనతో జట్టు విజయం సాధించింది. 

 

©️ VIL Media Pvt Ltd.