
Rahul Gandhi: భారత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరుని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ క్రమాన్ అక్మల్ ప్రస్తావించారు. రాజకీయ నేతకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆగ్రహానికి గురైన ఆ దేశ ఆటగాడు నసీమ్ షాకు కమ్రాన్ తనదైన శైలిలో బుద్ది చెప్పాడు. టీమిండియా క్రికెటర్లు ఎప్పుడైనా ఆ దేశ విపక్ష నేతకి సపోర్టుగా పోస్ట్‌లు పెట్టడం చూశావా? అని క్వశ్చన్ చేశాడు. భారతే కాదు.. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా రాజకీయ నేతలకు అండగా పోస్ట్‌లు పెట్టరు.. క్రికెటర్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి, తటస్థంగా ఉండటమే మంచిదని చురకలు అంటించాడు.
పాకిస్థాన్ రాజకీయ నేత మరియం నవాజ్ గురించి నసీమ్ షా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అతడ్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అభిమానులు లేకుండా జరుగుతున్న పీఎస్‌ఎల్ ఆరంభ వేడుకులకు ఆమె హాజరైంది. అయితే ఇందన కొరత, భద్రతా కారణాలతో ప్రేక్షకులను పీసీబీ పర్మిషన్ ఇవ్వలేదు.. మరియం నవాజ్‌కు ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయడంపై నసీమ్ షా ఫైర్ అయ్యారు. ఆమెను లార్డ్స్ మైదానంలో క్వీన్ లాగా ఎందుకు చూస్తున్నారంటూ అతడు ప్రశ్నించాడు.
నసీమ్ షా పెట్టిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. దీంతో అతడు తన పోస్ట్‌ను తొలగించి మరియం నవాజ్‌కు క్షమాపణలు చెప్పేశాడు. కానీ ఆ ట్విట్ స్క్రీన్ షాట్స్ నెట్టింట తెగ వైరల్ కావడంతో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు చేపట్టింది. 20 మిలియన్ల పాకిస్థాన్ రూపీలను (రూ.67 లక్షలు) ఫైన్ వేసింది. పాక్ ప్లేయర్స్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా 8 నెలల్లో సంపాదించే మొత్తానికి ఇది సమానం అని చెప్పాలి.. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడికి విధించిన అతిపెద్ద జరిమానా ఇదే.
ఇక నిషేధం విధించకుండా ఫైన్ తోనే సరిపెట్టి నసీమ్ షాను పీసీబీ రక్షించిందని క్రమాన్ అక్మల్ తెలిపారు. ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన అక్మల్.. నసీమ్ షా బ్యాన్ కి గురై ఉంటే కెరీర్ నాశనం అయ్యేదని తెలిపారు. పీసీబీ నసీమ్ షా కెరీర్‌ను కాపాడింది. అసలు అతని బౌలింగ్‌లోనే వేగం లేకుండా పోయింది.. అతను 145, 150 కిలోమీటర్ల స్పీడ్ తో కెరీర్ ప్రారంభించినప్పటికీ.. ఇప్పుడు అది 135, 137కి దిగజారింది. అతని డైట్ ప్లాన్ ఏంటి? ఏం చేస్తున్నాడు? అనవసర విషయాలను వదిలేయ్ అని సూచించాడు.
నసీమ్ షా తన కష్టార్జితం, నైపుణ్యంతో చిన్న వయసులోనే అన్నీ సాధించాడని కమ్రాన్ అక్మల్ తెలిపారు. సొంత బిడ్డను రక్షించినట్లు నసీమ్ షాను కాపాడిన పీసీబీ ఛైర్మన్‌కు అతను వెళ్లి ధన్యవాదాలు చెప్పాలని సూచించారు. నసీమ్ షా నువ్వు ఒక వ్యవస్థలో భాగమైనప్పుడు తటస్థంగా ఉండాల్సిందే. క్రికెట్‌పై మాత్రమే నజర్ పెట్టాలి.. టీమిండియా ప్లేయర్స్ రాహుల్ గాంధీ గురించి ట్వీట్లు చేస్తున్నారా? అని కమ్రాన్ అక్మల్ ప్రశ్నించాడు.