
కింగ్ నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా షూటింగ్‌లో శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే.. లేటెస్ట్ ‘డీ-ఏజింగ్’ (De-aging) టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల నాగార్జునను వెండితెరపై 25 ఏళ్ల నవ యువకుడిగా చూడబోతున్నాం. కథలో భాగంగా ఆయన 25 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయసు వరకు రకరకాల గెటప్స్‌లో కనిపిస్తారట. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో సీనియర్ నటి టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో ఒక విజువల్ వండర్‌గా నిలవబోతోందని నాగ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా
Also Read : Sai Rajesh :మెగాస్టార్ సినిమాలకు మణిశర్మ ప్లస్ పాయింట్..
ఈ సినిమా కథాంశంపై నాగార్జున తాజాగా కొన్ని ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చారు. “ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఏమీ లేని స్థితి (సున్నా) నుండి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూస్తారు. కథ మొత్తం తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది” అని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 45 శాతం పూర్తయినట్లు సమాచారం.