కావాల్సిన పదార్ధాలు : పావు కిలో ఉల్లిపాయలు, నాలుగు పండు టమాటాలు, ఎండు మిర్చి, అర కప్పు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, 4 పచ్చి మిర్చి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా ఉల్లిపాయలను తీసుకుని వాటిని బాగా క్లీన్ చేసుకుని ఒక గిన్నె లేదా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఎండు మిర్చిని కూడా నీళ్ళలో బాగా కడిగి తేమ లేకుండా ఒక క్లాత్ తో క్లీన్ చేసి వాటిని బాగా ఆరబెట్టాలి.
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి, కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ టమాటాలు, ఎండు మిర్చిని వేసి బాగా పాన్ లో బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని రోటిలో ఒక్కొక్కటిగా బాగా దంచుకోవాలి.
ఇప్పుడు రోటిలో నూరే టప్పుడు కొద్దిగా ఉప్పు, నిమ్మకాయంత చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తే బాగా రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మిక్సీలో పట్టుకునే కన్నా రోటిలో నూరితే బాగా రుచిగా ఉంటుంది.
ఈ ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దానిలో మూడు స్పూన్స్ నిమ్మరసాన్ని వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంట బాబోయ్ మేము తినలేము అనుకుంటే దానిలో టమాటాలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, వేడి వేడి ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ.




