Reading Time: < 1 minute
Uk Defies Trump Pm Keir Starmer Refuses To Join Iran War Proposes Global Hormuz Summit

UK on Iran War: బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు, నాటో కూటమిలో సభ్యులు తనతో కలవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో యూకే సహకరించడం లేదని మండిపడ్డారు. ఇకపై మీ చావు మీరు చావండి అంటూనే, నాటో కూటమి నుంచి వైదొలగాలని అమెరికా భావిస్తోంది. ఇలా భయపెడుతున్నా, ట్రంప్‌ను ధిక్కరిస్తూ బ్రిటన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: Shreyas Iyer Record: ‘కింగ్ ఎక్కడన్నా కింగే’ రా.. పీబీకేఎస్, కేకేఆర్ చరిత్రలోనే శ్రేయస్ అయ్యర్ టాప్‌!

తాము ఇరాన్ యుద్ధంలో చేరబోమని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తేల్చి చెప్పాడు. ఇదే కాకుండా ట్రంప్‌కు మరింత కోపం తెప్పించే విధంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి గ్లోబల్ హార్ముజ్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇరాన్ యుద్ధం బ్రిటన్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్టార్మర్ హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

“నాపైనా, ఇతరులపైనా ఎంత ఒత్తిడి వస్తున్నా, ఎంత గందరగోళం సృష్టిస్తున్నా, నా నిర్ణయాలన్నీ బ్రిటన్ పౌరుల శ్రేయస్సు కోసమే ఉంటాయి. అందువల్ల, ఇది మన యుద్ధం కాదని, మనం ఇందులో చిక్కుకోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాను,” అని ఆయన అన్నారు. మరోవైపు, త్వరలో యూరప్‌ను కూడా ఇరాన్ యుద్ధం ప్రభావితం చేస్తుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) హెచ్చరించింది.