
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై, అలాగే దేశ సంసిద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జె.పి. నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పూరి ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శులు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, అలాగే క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్‌పై పడే ప్రభావంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో సీసీఎస్ రెండోసారి సమావేశం ఇది. తొలి సమావేశంలో గల్ఫ్ దేశాల పరిస్థితిపై చర్చ, దేశం ఎదుర్కొంటున్న పరిణామాలపై ప్రజెంటేషన్ ఇవ్వడంతోపాటు.. దేశ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలపై ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు.