
Gas Cylinder Scam: యుద్ధం, గ్యాస్ కృత్రిమ కొరతను ఆసరాగా చేసుకొని బ్లాక్ మార్కెట్‌లో కమర్షియల్ గ్యాస్‌సిలెండర్‌లను అమ్ముతున్న ముఠా దందా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్మశానవాటికను అడ్డాగా చేసుకొని.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తుంది ముఠా. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి భారీగా కమర్షియల్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు మహ్మద్ అమీర్, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు.
READ ALSO: Middle East War Impact: షోరూమ్‌ల్లో దుమ్ముపడుతోన్న రోల్స్ రాయిస్, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు..
యుద్ధం ఎఫెక్ట్ కారణంగా.. ప్రస్తుతం గ్యాస్ కొరత కొనసాగుతోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర వ్యాపారస్తులకు గ్యాస్ సిలిండర్లు సమయానికి దొరకడం లేదు. దీంతో గ్యాస్ సిలెండర్ ఏజెన్సీలలో కొంత మంది బ్లాక్ మార్కెట్‌కు కమర్షియల్ సిలెండర్‌లను తరలించి.. అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. ప్రధానంగా కమర్షియల్ సిలెండర్‌లను ఇష్టానుసారంగా, డిమాండ్ ను ఆసరాగా చేసుకొని అమ్ముతున్నారు. మహ్మద్ అమీర్‌తో పాటు మరో 9 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మెట్రో గ్యాస్ ఏజెన్సీకి వచ్చే సిలెండర్‌లను పక్కదారి పట్టించారు. పంజాగుట్టలోని శ్మశానవాటికను అడ్డాగా చేసుకొని.. దందా స్టార్ట్ చేశారు. శ్మశానవాటిక సిబ్బందిని మేనేజ్ చేసి.. ఆ ప్రాంతాన్ని గోదాంగా మార్చారు. కమర్షియల్ సిలెండర్‌లను శ్మశానవాటికలో డంప్ చేసి.. అక్కడి నుంచి పలు వాహనాల్లో బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు.
కమర్షియల్ సిలెండర్లకు బ్లాక్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో 2100 రూపాయలు ఉండే సిలెండర్‌ను మహ్మద్ అమీర్ ముఠా 6 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాకు సంబంధించిన పక్క సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 414 కమర్షియల్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుల నుంచి హెచ్‌పీ ఫుల్ గ్యాస్ సిలిండర్ 47 కిలోలవి 30, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ నిండువి 19 కిలోలవి 148, ఖాళీ సిలిండర్లు 19 కిలోలవి 192, ఐదు కిలోల ఫుల్ సిలిండర్లు 35, 5 కిలోల ఖాళీ సిలిండర్లు 9, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సిలిండర్‌లను సివిల్ సప్లై అధికారులకు అప్పగిస్తున్నామని తెలిపారు.
READ ALSO: Father Murder Case: జాలి లేని జన్మ.. మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన దుర్మార్గుడు!