
ఆస్తిపన్ను చెల్లింపులో బకాయిపడిన తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవనాన్ని జీహెచ్‌ఎంసి అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని జయలలిత అపార్ట్‌మెంట్ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులు బకాయిపడుతున్నట్టు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు పన్ను చెల్లించనందుకుగానూ ఆ భవనాన్ని సీజ్ చేశారు. ఈ విషయం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఆసక్తికరమైన చర్చకు కేంద్రబిందువైంది. ఇక అధికారులు ఇటీవల ఆస్తిపన్ను చెల్లింపులు పెండింగ్ పడినందున కమర్షియల్ భవనాలను సీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడక్కడ పన్ను బకాయిపడిన వారికి చెందిన ఆస్తులను సీజ్ చేయడం ద్వారా పన్ను వసూళ్ళను రాబడుతున్నారు. ఇదిలా ఉండగా జయలలిత ఇల్లు అని కూడా తెలియదని అధికారులు చెప్పడం గమనార్హం. మొదట కమర్షియల్ ప్రాపర్టీగా గుర్తించిన అధికారులు సీజ్ చేసిన ఈ భవనాన్ని, తరువాత రెసిడెన్షియల్ భవన నిబంధనల ప్రకారం సీజ్ తొలగించారు.
సీజ్ చేయడం…
ఈ భవనంపై మొత్తం రూ.1.59 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉంది. ముందుగా భవనాన్ని సీజ్ చేయడంతో పన్ను వసూలుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రూ.78 లక్షలు అసలు పన్ను కాగా రూ.81 లక్షలు వడ్డీగా ఉంది. ఈ బకాయిలు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పేరుకుపోయి ఉన్నాయి. ఈ భవనం వాస్తవానికి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కేటగిరీలోకి వస్తుందని తర్వాత అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం నివాస గృహాలను సీజ్ చేయకూడదనే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సీజ్‌ను తొలగించినట్టు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా భవనం ఖాళీగా ఉండటం వల్ల పన్ను చెల్లింపులు జరగలేదనేది సమాచారం. సంబంధిత భవన హక్కుదారులు జీహెచ్‌ఎంసీ అధికా రులను సంప్రదించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీనిచ్చారు. ఈ హామీతో పాటు, నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీలపై సీజ్ విధించడం తగదనే కారణంతో అధికారులు సీజ్‌ను ఎత్తివేశారు. పన్ను బకాయిల వసూళ్లపై జీహెచ్‌ఎంసీ కట్టుదిట్టంగా చర్యలు కొనసాగి స్తోందని తెలిపారు.