Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూకే ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ షాకిచ్చాడు. నాటో నుంచి వైదొలుగుతానంటూ ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో స్మార్టర్‌ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధంలోకి బ్రిటన్ దిగబోదని స్పష్టం చేశారు. అయితే, టెహ్రాన్ దిగ్బంధించిన కీలక నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే మార్గాలను అన్వేషించడానికి ఒక ప్రపంచ దేశాలతో సదస్సును నిర్వహిస్తామని బుధవారం ఆయన ప్రకటించారు.

నాటో నుండి అమెరికాను ఉపసంహరించుకోవడాన్ని గట్టిగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా.. తమపైనా ఎంత ఒత్తిడి చేసినా.. ఎంత గందరగోళం సృష్టించినా.. తాను బ్రిటీష్ జాతీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తానని స్టార్మర్ తెలిపారు. యుద్ధంతో తమకు సంబంధం లేదని చెప్పారు.హోర్ముజ్ దిగ్బంధనాన్ని తొలగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామన్నారు. దీనికోసం అంతర్జాతీయ దౌత్య సదస్సును ఈ వారమే యూకే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కీలక చమురు రవాణా మార్గంలో సముద్ర భద్రతను పునరుద్ధరించడానికి కలిసి పనిచేస్తామని 35 దేశాలు ఒక ప్రకటనపై సంతకం చేశాయని ఆయన చెప్పారు.

యుద్ధంలో వాషింగ్టన్‌కు మద్దతు ఇవ్వడానికి నాటో నిరాకరించినందుకు నిరసనగా, ఆ కూటమి నుండి వైదొలగడాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.ఇరాన్ తో యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా జెట్‌లకు తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి నాటో మిత్రదేశాలైన ఇటలీ, స్పెయిన్‌లు నిరాకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.