Reading Time: < 1 minute

హైదరాబాద్: మంగళ్‌హాట్ పరిధిలో భారీగా కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎ టూ జడ్ అే సోదాం అనే గోదాంలో హెచ్ ఫాస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఉన్న 10 టన్నుల మేకల, గొర్రెల మాంసాలను స్వాధీనం చేసుకున్నారు. గోదాంపై వెటర్నరీ అధికారులు, గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కుళ్లిన మాంసాన్ని నిల్వ చేసిన అఫ్రోజ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణా, యుపి, మహారాష్ట్ర నుంచి మాంసం తెప్పించి అఫ్రోజ్ ఇక్కడ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. రోజుల తరబడి స్టోర్ చేసి శుభకార్యాలకు ఆర్డర్లపై సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.