Reading Time: < 1 minute

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో దారుణం జరిగింది. రంగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రంగంపల్లి గ్రామంలో పద్మమ్మ(65) అనే వృద్ధురాలు నివసిస్తోంది. గతంలో ఆమె భర్త మాజీ ఎఎస్‌ఐ రిటైర్డ్ అయ్యాడు. పద్మమ్మ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను పెన్షన్ డబ్బుల కోసం చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.