Reading Time: 2 minutes
Hyderabad Serial Killer Vasu Arrest Elderly Murder Cases

వృద్ధురాల్లే అతడి టార్గెట్.. నైస్‌గా మాట్లాడతాడు.. కారు ఎక్కించుకుంటాడు.. ఆ తర్వాత కారులోనే చంపేస్తాడు.. వాళ్ల ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుంటాడు.. నిర్మానుష్య ప్రదేశంలో డెడ్‌బాడీ పడేసీ ఎస్కేప్ అవుతాడు.. పోలీసులు, సీసీ కెమెరాలకు దొరకకుండా ఇలా సీరియల్‌గా మర్డర్స్ చేస్తూనే ఉన్నాడు. అలాంటి క్రిమినల్ అండ్ సీరియల్ కిల్లర్‌ను తాజాగా ఫిలింనగర్ పోలీసులు కటకటాల్లోకి నెట్టాడు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు? పోలీసులు ఈ కేసులను ఎలా ఛేదించారు?

ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వాసు. ఇతనో సీరియల్ కిల్లర్. కేవలం వృద్ధురాళ్లను మాత్రమే టార్గెట్ చేస్తాడు. వారిని మాటల్లో పెట్టి తనతో కారులో తీసుకు వెళ్తాడు. సీన్ కట్ చేస్తే.. వారిని హత్య చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుంటాడు. డెడ్ బాడీలను నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసి పరారవుతాడు. ఇప్పుడు ఈ సీరియల్ కిల్లర్‌ను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు..

మార్చి 11, 14న ఇద్దరు వృద్ధురాళ్లను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన సైకో కిల్లర్ వాసును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. యాదమ్మ అనే వృద్ధురాలు.. నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఇంట్లో 30 ఏళ్ల పాటు వంట మనిషిగా పని చేసింది. యాదమ్మ పచ్చళ్లు పెట్టడంలో ఫేమస్. దీంతో హంతకుడు మా సార్ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టాలంటూ నమ్మబలికి యాదమ్మను కారులో తీసుకెళ్లి హత్య చేయడం సంచలనం రేపింది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు సీరియల్ సైకో కిల్లర్ వాసును అరెస్ట్ చేశారు…

ఈ కేసులో హంతకుడు వాసును అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు నిందితుడు వాసు. యాదమ్మను కారులో తీసుకువెళ్లి నార్సింగి ఓఆర్ ఆర్ వద్ద ఓ నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న చెవి కమ్మలు, ముక్కు పోగుతో ఎస్కేప్ అయినట్లు తెలిపాడు. చెవికమ్మల కోసమే వృద్ధురాలు యాదమ్మను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు…

నార్సింగి ఓఆర్ఆర్ సమీపంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు యాదమ్మ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కేసులు పరిశీలించగా ఇటీవలే ఫిలిం పోలీస్ స్టేషన్లో యాదమ్మ మిస్సింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో యాదమ్మ ప్రయాణించిన కారు సీసీ ఫుటేజ్ ఆధారంగా వాసుని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. విచారణలో వాసు మరో హత్య కేసు ఒప్పుకున్నాడు. అంతే కాదు పోలీసుల విచారణలో మరిన్ని సంచలన విషయాలు చెప్పాడు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 44లో మరో వృద్ధురాలు మంగవ్వను కిడ్నాప్ చేసి నగర శివారులో హత్య చేశానని తెలిపాడు…

వృద్ధురాలు మంగవ్వను కూడా చెవి కమ్మల కోసం హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతే కాదు.. ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్‌ చేసి హత్య చేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్లో రోజూ బట్టలు ఉతికి ఇస్త్రే చేసే మంగతాయారమ్మని టార్గెట్ చేశాడు. మార్చి 14న ఆమె పని ముగించుకుని బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్-46లోని మస్తాన్‌నగర్‌లో దింపుతానని తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు.. అదే రోజు ఆమె తీసుకున్న జీతం 16 వేలు తీసుకుని ఉడాయించాడు…

వాసు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని.. ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశ్యంతో సీరియల్ మర్డర్స్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లాకు చెందిన వాసుని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరిన్ని కేసులోను సైకో కిల్లర్ వాసు పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు…