
ఏపీ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.వైఎస్సార్ సీపీ అమరావతికే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకం కాదని అన్నారు జగన్. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో బుధవారం ( ఏప్రిల్ 1 ) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు జగన్. రాజధాని నిర్మాణానికి రూ. రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు జగన్.
అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే ఎకరానికి రూ. 2 కోట్లు అవుతుందని అన్నారు. చంద్రబాబు లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని.. లక్ష ఎకరాలకు రూ. 2 లక్షల కోట్లు కావాలని అన్నారు. ఈ రూ. 2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే ఉంటుందని అన్నారు జగన్.
ఒకప్పుడు అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ అంటూ చంద్రబాబు ఉదరగొట్టారని.. ఇప్పుడు అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారంటూ ప్రశ్నించారు జగన్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని..ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయని అన్నారు. ఏడేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు.
భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా…? అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారని అన్నారు జగన్.
అమరావతిపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని… చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని అన్నారు జగన్. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా ఆడారని..రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదని అన్నారు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి అని అన్నారు.