Reading Time: 2 minutes

IPL 2026: LSG vs DC మధ్య హైటెన్షన్ పోరు.. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధమైపోయింది. ఏప్రిల్ 1న ల‌క్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ వర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తలప‌డ‌నున్నాయి. ఈ సీజ‌న్‌లో రెండు టీమ్స్ కి ఇదే ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచి, విజయంతో మెగా క్యాష్ రిచ్ లీగ్ ని ఆరంభించాల‌ని ఇరు జ‌ట్లు చూస్తున్నాయి. గ‌త సీజ‌న్‌లో అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైన ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్, మరీ ఈసారి ఎలా ఆడ‌తాడోన‌ని అందరు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. 

గ‌త సీజ‌న్ ప్రారంభం నుంచే ల‌క్నో పేస‌ర్ల గాయాల‌తో ఇబ్బంది పడగా.. ఈ సారి మాత్రం ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ష‌మీ, నోర్జే లాంటి సీనియ‌ర్లకు తోడుగా యువ పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ కూడా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ అందుబాటులో లేక‌పోయినప్పటికీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్ట్రాంగ్ బౌలింగ్ విభాగాన్ని క‌లిగి ఉంది. లుంగి ఎంగిడి పేస్ విభాగానికి సారథ్యం వ‌హించ‌బోతున్నాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాద‌వ్ జోడీ స్పిన్ బాధ్యతలను సేర్ చేసుకోనుంది. 

హెడ్‌ -టు-హెడ్ రికార్డులు: 
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు 7 సార్లు ముఖాముఖిగా పోటీపడ్డాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో ల‌క్నో గెలవగా, మరో నాలుగు సార్లు ఢిల్లీ విజయం సాధించింది.  

పిచ్‌ రిపోర్ట్: 
ఎకానా స్టేడియంలోని పిచ్ సాధార‌ణంగా స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉండనుంది. స్పిన్‌ బౌలింగ్ ను స‌మ‌ర్థవంతంగా ఆడే బ్యాటర్లు భారీ స్కార్ చేసే అవకాశం ఉంటుంది. ఇక టాస్ గెలిచిన జ‌ట్టు బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. 

తుది జ‌ట్ల అంచ‌నా: 

లక్నో సూపర్ జెయింట్స్..
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, అన్రిచ్ నోర్ట్జే, మొహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, దిగ్వేష్ రాఠీ.
ఇంపాక్ట్ ప్లేయర్: షాబాజ్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్:
పాతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, ఆకిబ్ నబీ, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి.
ఇంపాక్ట్ ప్లేయర్: టి. నటరాజన్

©️ VIL Media Pvt Ltd.