
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.