Reading Time: < 1 minute
Jammu Kashmir Encounter Ganderbal Terrorist Killed Security Forces Operation

జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గందర్‌బల్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో గందర్‌బల్ జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఇద్దరు ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం ప్రతిదాడులు చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం కాగా.. తప్పించుకున్న మరొక ఉగ్రవాది కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని భారత సైన్యం తెలిపింది.

బుధవారం తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయనే సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Stock Market: యుద్ధంపై ట్రంప్ సానుకూల ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు

గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భద్రతా దళాలు గట్టి నిఘా పెంచారు. ప్రత్యేక ఆపరేషన్లతో ఇప్పటికే పలువురి ఉగ్రవాదుల భరతం పట్టారు. తాజాగా మరొక ఉగ్రవాదిని హతమార్చారు.