
ఇరాన్ లో ఖమేనీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు మూడో వారంలో ప్రవేశించాయి. మరో పక్క అధికార పక్షం ప్రమేయంతో ప్రభుత్వం, ఖమేనీ కి మద్దతుగా పోటీ ప్రదర్శనలు జరగడంతో గందరగోళం నెలకొంది. నిరసన కారులపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడడంతో దాదాపు 500 మందికి పైగా మరణించారు. ఈ నేఫథ్యంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఇరాన్ విదేశాంగమంత్రి సోమవారం ప్రకటించారు.అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తాము జోక్యం చేసుకుంటామని ప్రకటించడం తో నిరసనలు హింసాత్మకంగా,
రక్తసిక్తంగా మారాయని అబ్బాస్ అరఘ్చి ఆరోపించారు. కానీ విదేశాంగ మంత్రి తన ప్రకటన, ఆరోపణలను సమర్థించే ఎలాంటి సాక్ష్యాలనూ చూపలేదు.కాగా, రెండు వారాల పాటు సాగిన నిరసనలో 500 మందికి పైగా చనిపోయారని, వారిలో దాదాపు అందరూ ప్రదర్శన కారులే అని విద్యార్థులు అంటున్నారు.విదేశాంగమంత్రి అరఘ్చి టెహ్రాన్ లోని విదేశీ దౌత్య వేత్లలతో మాట్లాడారు. దేశంలో ఇంటర్ నెట్ సేవలను ప్రభుత్వం నిలిపి వేసింది, అయినా, ఖతార్ నిధులతో నిలిచే అల్ జజీరా ఉపగ్రహ వార్తా నెట్ వర్క్ పనిచేయడానికి అనుమతించబడింది. అలాగే ఆయన వ్యాఖ్యలను మీడియా సంస్థలు ప్రచురించాయి.
ప్రభుత్వ అనుకూల ప్రదర్శనల్లో ప్రెసిడెంట్, విదేశాంగమంత్రి
నిరసన ప్రదర్శనలకు పోటీగా ఇరాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. తన బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం లక్షలాది మంది మద్దతుదారులను కూడగట్టి ప్రదర్శనలు నిర్వహింపజేసింది. టెహ్రాన్ ఎం. ఘెలాబ్ స్క్వేర్ వద్ద వందలాది మంది ప్రదర్శకులు గుమికూడారు. ప్రదర్శనలో ప్రెసిడెంట్ పెజెష్కియాన్, విదేశాంగమంత్రి అబ్బాస్ అరఘ్చి ఇతరులు పాల్గొన్నారు. టెహ్రాన్ తో పాటు, జాహెదాన్, కెర్మాన్, రఫ్త్ ఇతర నగరాలలో ప్రదర్శనలు జరిగాయి.