Reading Time: < 1 minute

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జనవరి 10న రెండుసార్లు అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సోమవారం నాడు ఆయనను ఆల్ -ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) లో చేర్చారు. ఆయనకు తక్షణం చికిత్స చేస్తున్నారు. 74 ఏళ్ల ధన్కడ్ కు ఎంఆర్ ఐ స్కాన్ తో పాటు ముఖ్యమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. జనవరి 10న తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ధన్కడ్ వాష్ రూమ్ లో రెండుసార్లు సృ్పహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. అనారోగ్య కారణాల వల్లనే 2025 జూలై 21న ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. గత సంవత్సరం కూడా గుండె సంబంధమైన సమస్యల కారణంగా ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు.