
మాదాపూర్‌లోని సైబర్ టవర్ గేట్ వద్ద రోడ్డు కుంగడంతో ఐదు రోజులు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. ఐకియా నుంచి సైబర్ టవర్ , జేఎన్‌టీయూ వైపు వెళ్లే వాహనాలను ఐదు రోజుల పాటు ఐకియా నుంచి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు లేదా సూచించిన డైవర్షన్‌లో వెళ్లాలని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఐకియా నుంచి వచ్చే వాహనాలను లెమన్ ట్రీ హోటల్ లేదా రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఎడమ వైపు మళ్లిస్తారు. అక్కడి నుంచి టెక్ మహీంద్రా, -సీఐఐ జంక్షన్ మార్గంలో సైబర్ టవర్స్ వైపు మళ్లిస్తారు, అక్కడి నుంచి జెఎన్‌టియూ వైపు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రయాణికులు పోలీసులకు సహకరించి, సూచించిన మార్గాలను అనుసరించి రాకపోకలు సాగించాలని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.