
గాంధీనగర్: గుజరాత్‌లోని వడోదరలో న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్ట్రీస్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ రన్నింగ్ చేస్తూ కనిపించాడు. ఎదరుగా అర్షదీప్ రన్నింగ్ చేస్తుండడం గమనించి ఇమిటేట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రౌండ్‌లోకి దిగినప్పుడు ఎంత సిరీయస్‌గా ఉంటాడో బయట మాత్రం అంత సరదాగా ఉంటాడు. జస్‌ప్రీత్ బుమా బౌలింగ్ యాక్షన్, సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా వాకింగ్ స్లైల్‌ను విరాట్ ఇమిటేట్ చేసి గతంలో నవ్వులు తెప్పించిన విషయం తెలిసిందే. కెఎల్ రాహుల్, హర్బజన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లను ఆటపట్టించాడు. టీమిండియా ఆటగాళ్లతో కోహ్లీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు.