Reading Time: < 1 minute

అమరావతి: తెలుగు రాష్ట్రాల సిఎంలు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలు తెలుగుజాతి గౌరవం పెంచేలా ఉన్నాయని ఎపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. జల వివాదాల పరిష్కారానికి ముందుకు రావడం శుభసూచికం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువారి ప్రయోజనాల కోసమే తపన పడుతున్నట్లు స్పష్టమౌతుందని, రాష్ట్రాలుగా విడిపోయినా.. అన్నదమ్ముల్లా కలిసి ఉందామనే స్ఫూర్తి కనబడుతోందని తెలియజేశారు. కలిసి ఉందామని వీరు చాటుతుంటే.. మాజీ సిఎంలు ఓర్వలేకపోతున్నారని, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కుట్ర పాచికలు పారట్లేదని సోమిరెడ్డి విమర్శించారు. తెలుగు ప్రజలు.. స్వార్థ రాజకీయాల ట్రాప్ లో పడేంత అమాయకులైతే కాదని అన్నారు. ఎక్కడ ఉన్నా.. తెలుగు జాతి బాగుండాలన్నదే తమ లక్ష్యం అని సోమిరెడ్డి పేర్కొన్నారు.