Reading Time: < 1 minute
TGPSC కీలక ప్రకటన: OTR Update గడువు మళ్లీ పొడిగింపు! పూర్తి వివరాలు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఓటీఆర్ (One Time Registration) అప్డేట్ గడువును అభ్యర్థుల సౌకర్యార్థం మరోసారి పొడిగించింది. ముందుగా మార్చి 25 వరకు ఇచ్చిన గడువును ఇప్పుడు ఏప్రిల్ 10, 2026 వరకు విస్తరించింది.

ఓటీఆర్ ప్రాముఖ్యత

TGPSC ద్వారా వచ్చే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేయాలంటే ఓటీఆర్ నమోదు తప్పనిసరి. ప్రతి అభ్యర్థికి ఒక్క ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. అది అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. భవిష్యత్తులో ఉద్యోగ దరఖాస్తులకు ఓటీఆర్‌లోని వివరాలనే ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తారు.

అప్‌డేట్‌లో తప్పనిసరి విషయాలు

  • తాజా కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • సంబంధిత విద్యార్హత సర్టిఫికేట్లు

మార్చుకోగల వివరాలు

  • అదనపు విద్యార్హతలు
  • చిరునామా (Address)
  • EWS / Non-Creamy Layer స్టేటస్
  • మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ
  • కేటగిరీకి సంబంధించిన సమాచారం

గమనిక: ఇతర ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు మార్చడానికి అవకాశం ఉండదు.

  • ఓటీఆర్ అప్డేట్ విధానం (Step-by-Step)
  • అధికారిక వెబ్‌సైట్: https://www.tgpsc.gov.inకు వెళ్లండి
  • మీ TSPSC/OTR ID, జనన తేదీతో లాగిన్ అవ్వండి
  • “Edit / Update OTR” ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  • మీ వ్యక్తిగత, విద్య, కేటగిరీ వివరాలను సరిచూసి అవసరమైతే సవరించండి
  • కొత్త ఫోటో, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయండి
  • అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో చూసి సమర్పించండి.

ముఖ్య సూచన

ఓటీఆర్‌లో ఇచ్చే వివరాలే భవిష్యత్తులో అన్ని ఉద్యోగ దరఖాస్తులకు ఆధారంగా తీసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా, ఖచ్చితంగా వివరాలు నమోదు చేయాలి.