Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కోల్‌కతా నైట్‌రైడర్స్  బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ(48) చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరద పారించారు. ఫలితంగా పవర్‌ప్లేలో హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెస్ హఫ్ సెంచరీతో రాణించారు. నితీష్ రెడ్డి(39)  కూడా పర్వాలేదని పించారు. కోల్‌కతా బౌలర్లలో ముజరబాని 4, వైభవ్ 2, త్యాగి, అనుకుల్ తలో వికె్ తీశారు.