Reading Time: < 1 minute

 ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ కుంచె నుంచి జాలు వారిన చిత్రం రికార్డుల్లోకి ఎక్కింది. యశోద చిన్ని కృష్ణుడితో కలిసి పాలు పితుకుతున్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లు దక్కించుకుంది. దీంతో అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా తొలిస్థానం దక్కించుకుంది. 1890లలో గీసిన ఈ చిత్రాన్ని తాజాగా ముంబయిలో ప్రత్యక్ష వేలం నిర్వహించారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం రూ.118 కోట్ల అత్యధిక ధరతో రికార్డుల్లో ఉండేది.. తాజాగా అది చెరిగిపోయింది.