Reading Time: 2 minutes

IPL 2026: అభిషేక్ వైల్డ్ ఫైర్ బ్యాటింగ్.. 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి SRH స్కోర్ ఎంతంటే!

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరుగుతున్న హైవోల్టెజ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరబాద్ కి అద్భుతమైన ఓపెనింగ్ లభించింది. SRH స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కొట్టే కొట్టుడికి కేకేఆర్ బౌలర్లు విలవిలలాడిపోయారు. ఎటువైపు బాల్ వేసిన బౌండరీ ధాటాల్సిందే అనే రీతిలో హెడ్, అభి చేసిన బ్యాటింగ్ తో బెంబేలెత్తిపోయారు. దీంతో కేవలం10 ఓవర్లలోనే  ఆరెంజ్ ఆర్మీ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగినసన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రారంభం నుంచే కేకేఆర్ బౌలర్లపై ఒత్తిడి పెట్టారు. ఈ సందర్భంగా వైభవ్ ఆరోరా వేసిన తొలి ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. బ్లెస్సింగ్ ముజరబానీ వేసిన రెండో ఓవర్ నుంచి పరుగుల వేట ప్రారంభించారు.  కార్తిక్ త్యాగి బౌలింగ్ (5.4)లో  దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న హెడ్ (21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సులతో 46 పరుగులు)ని ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన SRH కెప్టెన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. కానీ ఆ తర్వాత బ్లెస్సింగ్ ముజరబానీ ఆరెంజ్ ఆర్మీకి డబుల్ షాక్ ఇచ్చాడు. 

ఒకే ఓవర్లో ఏకంగా ఇద్దరు బ్యాటర్లని ముజరబానీ పెవిలియన్ కి పంపించాడు. అతడు (8.2) వేసిన బంతికి భారీ ఆడిన ఇషాన్ (14) బౌండరీ లైన్ వద్ద రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ (21బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సులతో 48 పరుగులు)ని కూడా డగౌట్ కి పంపించాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అనికేత్ వర్మ (1) కూడా ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు. రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చిన స్టేడియం వీడాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ రెండు వికెట్లు తీసుకోగా కార్తిక్ త్యాగి, అనుకూల్ రాయ్ చెరో వికెట్ పడగొట్టారు. 

©️ VIL Media Pvt Ltd.