Reading Time: < 1 minute
Sunrisers Hyderabad Set Target Of 227 Runs For Kolkata Knight Riders

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 2) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 08 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 227 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ జట్టు తరఫున హెన్రిచ్ క్లాసెన్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి 5.4 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెడ్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు. కార్తిక్ త్యాగి హెడ్ వికెట్ తీశాడు.

Also Read:Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..

కెప్టెన్ ఇషాన్ కిషన్ పెద్దగా ఏమీ చేయలేక 14 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో అవుటయ్యాడు. 9వ ఓవర్‌లో ముజరబాని అభిషేక్‌ను కూడా ఔట్ చేశాడు. అభిషేక్ 21 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అనికేత్ వర్మ పెద్దగా రాణించలేక, కేవలం 1 పరుగుకే అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఐదవ వికెట్‌కు 82 పరుగులు జోడించారు. నితీష్ 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేశాడు.