Reading Time: 2 minutes
OTT Movie: థియేటర్లలో యావరేజ్ టాక్.. ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 గా తెలుగు సినిమా

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు, ఓటీటీ రిజల్ట్స్ రెండు వేరు వేరుగా ఉంటాయి. థియేటర్లలో బాగా ఆడిన సినిమాలు ఒక్కోసారి ఓటీటీలో పెద్దగా ఆడవు. అలాగే థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు ఒక్కోసారి ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంటాయి. అలా
ఇప్పుడు ఓ తెలుగు సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. పేరున్న హీరో నటించినప్పటికీ పెద్దగా ఆడలేదు. దీంతో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఓ మోస్తరు వసూళ్లతో మాత్రమే సరిపెట్టుకుంది. చివరికి ఐఎమ్‌డీబీలోనూ ఈ మూవీ పదికి 5 రేటింగ్ మాత్రమే సాధించుకుంది అదే సినిమా గత వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రాగా ఇప్పుడు టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో హీరో
ఓ జూనియర్‌ లెక్చరర్‌. కానీ అతనికి జాతకాలు, మూడనమ్మకాలటే పిచ్చి. అందుకే 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉంటాడు. అలాంటిది అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది లెక్చరర్‌ మనీషా. మొదట పట్టించుకోకపోయినా హీరో కూడా ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ కూడా అవుతారు. అయితే ఇంతలో మనీషా ఓ షాకింగ్ నిజం చెబుతుంది. దీంతో వీరిద్దరి జీవితాలు అనుకోని మలుపు తిరుగుతాయి. మరి మనీషా చెప్పిన ఆ నిజమేంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమానే విష్ణు విన్యాసం. నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, సత్యం రాజేష్, గోపరాజు రమణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుమంత్ నాయుడు నిర్మించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అప్పటి నుంచే ట్రెండింగ్ లో దూసుకుపోతోందీ సినిమా. ఇండియా వైడ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని మూవీస్‌లో అన్నింటిలో కెల్లా విష్ణు విన్యాసం సినిమానే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండడం విశేషం.

అమెజాన్ ప్రైమ్ లో విష్ణు విన్యాసం సినిమా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.