
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె అరుదైన రికార్డును సాధించాడు. గురువారం కోల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానె కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపిఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన దిగ్గజాల సరసన రహానె నిలిచాడు. ఇప్పటి వరకు రహానె తన కెరీర్‌లో 200 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు రహానెతో కలుపుకుని ఐపిఎల్‌లో 11 మంది మాత్రమే 200 మ్యాచ్‌లను ఆడారు. మహేంద్ర సింగ్ ధోని (278) మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (273), విరాట్ కోహ్లి (28) తర్వాతి స్థానాల్లో నిలిచారు.