
మక్తల్‌లో బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప మరణం వల్ల వాయిదా పడిన మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2 నుంచి 6 వరకు బిజెపి అభ్యర్థి నామినేషన్ స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని తెలిపారు. ఈనెల 7న నామినేషన్ పరిశీలన, 8న అప్పీల్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా కారణాలతో రీ పోలింగ్ అవసరమైతే మరుసటి రోజు అంటే ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.