
ఈ నెల 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో టాటా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ మల్కాజ్‌గిరి ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పేర్కొన్నారు.
నాగోల్ నుంచి హబ్సీగూడ వయా ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లే వారు, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వయా ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.
ప్రయాణికులు ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైలును ఉపయోగించుకోవాలి.
ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హెచ్‌ఎండిఏ ఉప్పల్ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద నుంచి మెహిఫిల్ హోటల్ మీదుగా నాగోల్, ఎల్‌బి నగర్ వైపు వెళ్లాలి.
ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు నాగోల్ మెట్రో వద్ద యూటర్న్ తీసుకుని నాగోల్ , హెచ్‌ఎండిఏ భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, చెంగిచెర్ల, ఐఓసిఎల్, చెర్లపల్లి ఫ్లైఓవర్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి.
తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సీగూడ ఎక్స్ రోడ్డు మీదుగా నాచారం, ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చెర్లపల్లి, ఘట్ కేసర్ వైపు వెళ్లాలి.
రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు స్ట్రీట్ నంబర్ 8 మీదుగా హబ్సీగూడ ఎక్స్ రోడ్డు, నాచారం,ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి.
వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ మీదుగా అబ్దుల్లార్‌మెట్, ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లాలి.
హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఎల్‌బి నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి.