
ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖకు ఆదాయం రూ.7097.38 కోట్లు సమకూరిందని రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. దీనిలో భాగంగా జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.4714.63 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.961.02 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.78.35 కోట్లు ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.820.09 కోట్లు, తనిఖీల ద్వారా రూ.212.49 కోట్లు, చలాన్ల ద్వారా రూ.310.80 కోట్లు సమకూరిందని రవాణా శాఖ స్పష్టం చేసింది. 2025-.26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా 7097.38 కోట్ల తో 83.16 శాతం సాధించామని రవాణా శాఖ తెలిపింది. 2024-.25 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 2.70 శాతం వృద్ధి రేటు సాధించామని రవాణా శాఖ వెల్లడించింది. 2025-.26 సంవత్సరంలో 91,637 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రూ.769.81 కోట్ల జీవిత కాలపు పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపింది.