Reading Time: < 1 minute

సారీ నాన్న అని లెటర్ రాసి.. KPHB కాలనీలో రూ. 8 లక్షలు, 9 తులాల బంగారంతో మైనర్ జంప్

Caption of Image.

ఈ జనరేషన్ మైనర్లు ఎలా ఉన్నారు..? దాదాపు అందరికీ అందుబాటులో ఫోన్లు, తిరిగేందుకు బైకులు, కొన్ని సార్లు కార్లు..  బైటికెళ్తే కొందరు ఏం చేస్తారు..? ఏమో.. వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు.. మందు తాగవచ్చు.. దమ్ము కొట్టవచ్చు.. డ్రగ్స్ కు బానిసకావచ్చు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయవచ్చు. అందరూ కాకపోయినా కొందరి లక్షణాలు ఇవి అని గతకొంత కాలంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఆధారంగా చెప్పవచ్చు. పైన చెప్పిన అలవాట్లలో ఏదో ఒక దానికి బానిసయ్యాడా లేక అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లో చేశాడో తెలియదు కానీ.. దాదాపు 25 లక్షల రూపాయల విలువైన సొమ్ముతో హైదరాబాద్ లో మైనర్ ఎస్కేప్ కావడం కలకలం రేపుతోంది.

కేపీహెచ్‌బీలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో చెప్పకుండా మైనర్ పారిపోయాడు. అదే సమయంలో బీరువాలోని రూ. 8 లక్షల నగదు, 9 తులాల బంగారం మాయం అవ్వడంతో..  వెళ్తూ వెళ్తూ ఎత్తుకెళ్లాడా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  2026 ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన కాలనీ వాసులను షాకింగ్ కు గురిచేసింది.

సిద్ధార్థ రెడ్డి(17) అనే మైనర్ తండ్రి స్ప్లెండర్ బైక్‌ తీసుకుని ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. బైక్‌ను ఎక్కడో ఒకచోట వదిలేస్తాను అని లేఖలో రాశాడు. బాలుడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 సిద్ధార్థ రెడ్డి ఇంట్లో నుంచి పారిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ రెండుసార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తండ్రి నాగార్జున రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.