Reading Time: < 1 minute
Peddi: ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన పెద్ది రిలీజ్ డేట్

ఇప్పుడు పెద్ది సినిమా వల్లనే కాదు, పెద్ద సినిమాల రిలీజ్‌ డేట్ల చుట్టూ ఎప్పుడూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాకపోతే మొన్న మొన్నటిదాకా ఈ రిలీజ్‌ డేట్‌ మేటర్‌ గురగించి బయటివారు మాత్రమే మాట్లాడుకునేవారు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఓపెన్‌ టాక్‌ షురూ అయింది. చెప్పిన టైమ్‌కి పెద్ది వస్తుందా? రాదా? ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. గాయపడ్డ సింహం సినిమాను మే 1న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. పెద్ది ఏప్రిల్‌ 30న వస్తే మా సినిమా విడుదల తేదీని మార్చుకుంటామని దిల్‌రాజు డిక్లేర్‌ చేయడంతో పెద్ది మీద అప్పటిదాకా ఉన్న అనుమానాలు ఒక్కసారిగా ఫ్లాష్‌ అయ్యాయి. మే 1న రావాలనుకున్న లెనిన్‌ పెద్ది కారణంగానే వాయిదా పడింది. పెద్ది రాకపోతే తమ సినిమాను కాసింత ముందుకు జరపడానికి సమంత కూడా రెడీగానే ఉన్నారు. మా ఇంటి బంగారం పనులన్నీ దానికి తగ్గట్టే జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఎస్‌కేఎన్‌ చెప్పిన మాట ఓ ఎత్తు. తమ చెన్నై లవ్‌ స్టోరీని జూన్‌ 26న విడుదల చేయాలనుకున్నామని, అయితే ఆ రోజు పెద్ది వచ్చే అవకాశాలున్నాయని సాయిరాజేష్‌ చెప్పడంతో రిలీజ్‌ డేట్‌ మార్చుకుని త్వరలోనే ప్రకటిస్తామని ఎస్‌కేఎన్‌ చెప్పారు. అయితే కాసేపటికే తూచ్‌మన్నారు ఎస్‌కేఎన్‌. పొరపాటైందని, పెద్ది జూన్‌ 26న వస్తుందని పలు ట్వీట్లు కనిపిస్తున్నాయనే సాయిరాజేష్‌ తనతో అన్నారని, ప్రోగ్రామ్‌ సందడిలో తాను అలా చెప్పేశానన్నారు. పెద్ది మేకర్స్ మరోసారి డేట్‌ కన్‌ఫర్మ్ చేసే వరకు ఈ చర్చకు ఫుల్‌ స్టాప్‌ పడే అవకాశం లేదన్నది విమర్శకుల మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే