
అమరావతి: గుంటూరు గోరంట్లలో వైసిపి నేత అంబటి రాంబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. తిరుమల కల్తీ నెయ్యిపై కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగించడానికి అక్కడకి వచ్చి రౌడీయిజం చేసి.. బూతులతో రెచ్చిపోయారు. గుంటూరు రోడ్లపై అనుచరులతో కలిసి వీరంగం చేశారు. పోలీసుల సమక్షంలోనే కర్రలు, రాడ్లతో దాడికి టిడిపి నాయకులు యత్నించారు. ఈ క్రమంలో ఆగ్రహించి కనీస మర్యాద లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడుపై అవాకులు పేల్చారు. రాయలేని పదజాలం విరుచుకుపడ్డారు. ఇరువర్గాల వాగ్వాదంతో రణరంగంగా మారిన ప్రాంతాన్ని పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. గుంటూరు వాసులు అంబటి రాంబాబు తీరుపై మండిపడి.. అరెస్టు చేయాలని పోలీసులకు డిమాండ్ చేశారు.