Reading Time: < 1 minute

హైదరాబాద్: హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లి చేసుకున్న విషయం విధితమే. 2024 డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం, 15న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. అప్పటి మధుర క్షణాలను మీడియాతో కీర్తి సురేష్ పంచుకున్నారు. ఇంత గ్రాండ్ పెళ్లి వేడుక జరుగుతుందని తాము ఊహించలేదన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నామని, తాళి కట్టే సమయంలో కళ్ల ముందు తన ప్రేమయాణం కదలాడిందని గుర్తు చేశారు. ఆనందబాష్పాలు ఆగలేదని, ఆంటోనీ కూడా నమ్మలేకపోయారని కీర్తి తెలిపారు. ఆంటోనీ కళ్లలో కూడా ఆనందం చూశానని, ఇది ఓ అందమైన ప్రయాణం అని చెప్పారు. తాము పారిపోయి పెళ్లి చేసుకుంటామని అనుకున్నామని కానీ కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహం ఘనంగా జరిందన్నారు.