
విశాఖ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ జట్టు, : టీమిండియాకు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుకు ఓపెనర్లు సీఫెర్ట్ (62), కాన్వే(44)లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 8.2 ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో కివీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
మిడిల్ ఓవర్లలో కొంచెం నిదానంగా ఆడినా.. క్రమంగా కవీస్ బ్యాటర్లు దూకుడు పెంచారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు, స్కోరు బోర్డు మాత్రం తగ్గకుండా పరుగులు రాబట్టారు. చివర్లలో డారిల్ మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మిచెల్.. 18 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సులతో 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. ఇక, భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా..బుమ్రా, రవి బిష్ణోయ్ లు ఒక్కో వికెట్ తీశారు.