Reading Time: < 1 minute

 దేశంలో వాంటెడ్ అయిన ఫరారీ నేరస్తులు 70 మందికి పైగా విదేశాలలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 25 సంవత్సరంలో వీరి ఆచూకిని కనుగొన్నట్లు అధికారిక నివేదికలో తెలిపారు. ఇక ఇదే సమయంలో ఇతర దేశాలకు చెందిన ఫరారీదార్లు 203 మంది వరకూ భారతదేశంలో ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్సనల్, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వశాఖ వెలువరించిన వార్షిక నివేదికలో ఈ విషయం స్పష్టం అయింది. వేరే దేశాలకు పారిపోయిన నేరస్తుల సంఖ్య పది సంవత్సరాల కాలంలో ఈసారి అత్యధికంగా ఉందని తెలిపారు. ఇక గత ఏడాది భారత్‌కు 27 మంది ఫరారీదార్లు తిరిగి వచ్చినట్లు కనుగొన్నారు. మంత్రిత్వశాఖ గడిచిన సంవత్సరంలో సిబిఐ , ఎన్‌సిబి పనితీరు గురించి కూడా నివేదిక వెలుడరించింది. ఇక నేరాలకు పాల్పడి పారిపోయిన వారిని తిరిగి రప్పిందేందుకు జరిపై లెటర్స్ రోగేటరీ న్యాయపరమైన ప్రక్రియ గురించి కూడా వెల్లడించారు. గత ఏడాది మార్చి 25 నాటికి పలు దేశాలకు సిబిఐ కేసులకు సంబంధించి ఇటువంటి 74 ఎల్‌ఆర్‌ఎస్‌లను పంపించారు . సిబిఐ కేసుల విషయాలలో 276 ఎల్‌ఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. 257 కేసులు రాష్ట్ర పోలీసు విభాగాలు, ఇతర కేంద్ర చట్టాల అమలు సంస్ధల పరిధిలోని కేసులు ఉన్నాయి.