
మన తెలంగాణ/మోత్కూర్: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానూర్ డిమాండ్ చేశారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.కాజా పసియుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేశ్, మోత్కూరు మండల అధ్యక్షులు సోమన్న తదితరులు పాల్గొన్నారు.