Reading Time: < 1 minute

బళ్లారి: కర్నాటక రాష్ట్రం బళ్లారిలోని ఎంఎల్ఎ గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పుపెట్టారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఆయన ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై బళ్లారి జిల్లా పోలీసులకు స్థానికులు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి కి నిప్పు పెట్టిన ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపణ చేశారు. జనవరి 1వ తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద మ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీల రగడ నెలకొన్న విషయం తెలిసిందే. బళ్లారి ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి గన్‌మన్‌ వద్ద తుపాకీ లాక్కుని కాల్పులకు తెగపడిన విషయం విధితమే.