
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘అఖండ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు బాలకృష్ణ తన నెక్స్ చిత్రంపై దృష్టి పెట్టాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలయ్య తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘ఎన్‌బికె111’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పు ల కారణంగా ఈ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. కాగా ఇప్పుడు ఈ చిత్ర స్క్రిప్ట్‌కి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని.. ఫైనల్ స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్‌పై దర్శకుడు గోపీచంద్‌తో పాటు బాలయ్య కూడా పూర్తి నమ్మకంగా ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మరి ఈసారి బాలయ్య ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.