
న్యూఢిల్లీ: జనాభా లెక్కలు 2026-2027 నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ ఏప్రిల్ 1 నుంచి మొదటి దశ జనగణన ప్రారంభమవుతుంది. ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేటర్లుదాదాపు 33 ప్రశ్నలు వేసి జవాబులు నమోదు చేస్తారు. ప్రభుత్వం గురువా రం 33 ప్రశ్నలను నోటిఫై చేసింది. ప్రతి ఇంటిలో ఉన్న మనుషుల జాబితా. ఇంటి గుర్తింపుతో పాటు, ఆ ఇళ్లలో ఎంతమం ది వివాహిత జంటలు ఉన్నాయి. ఇంటర్ నెట్ ఉందా. స్నానపు గదులు ఉన్నాయా. వంటి వివరాలను జనాభా గణన సిబ్బంది నమోదు చేస్తారు. 2011లో జనాభా గణన సందర్భంగా కేవ లం 29 ప్రశ్నలనే అడిగారు. ఈ సారి మరి కొన్ని ప్రశ్నలు జో డించారు. కొన్ని ప్రశ్నలను విభజించి, వివరాలు సేకరిస్తున్నా రు. 2027 జనగణనలో చేర్చిన ముఖ్యమైన ప్రశ్నలలో ఇంటర్నెట్ సదుపాయం ఉందా, కుటుంబ సభ్యులు వినియోగించే ప్రధాన తృణధాన్యాలు ఏమిటి వంటివి ఉన్నాయి. అయితే, బ్యాంకింగ్ సౌకర్యాలకు సంబంధించిన ప్రశ్నలను తొలగించారు.
పౌరులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయా, ఉం టే, వారు ఉపయోగించే మొబైల్ ఫోన్ వివరాలను అడుగుతా రు. 2027 జనాభా లెక్కల మొదటి దశలో ఇంటింటితిరిగి జ రిపే జనగణన ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ జరుగుతుంది. రాష్ట్రాలోనూ, కేంద్రపాలిత ప్రాంతంలోనూ నిర్దేశించిన 30 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. రెండోదశ – జనభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. 30 రోజుల గృహాల జాబితా కార్యక్రమానికి ముందు 15 రోజుల పాటు స్వీయ గణన నిర్వహించే అవకాశం ఉంది. మొదటి దశ నోటిఫికేషన్ ను హోం మంత్రిత్వశాఖ జారీచేసినా, రెండో దశ ప్రశ్నపత్రం – జనాభా గణన కు సంబంధించిన నియమాలను త్వరలో ప్రకటించనున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ , సెన్సెస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలలో ఆ ఇంటి పైకప్పు ఎలాంటిది ఉంది. ఫ్లోరింగ్ చేస్తే, ఏలాంటిది చేశారు. గోడలు ఎలాఉన్నాయి. ఎలాంటి నిర్మాణం, ఇం టి యజమాని పురుషులా, స్త్రీలా, వారు ఏ రకం తృణధాన్యా లు వినియోగిస్తారు. ఆధునిక సౌకర్యాలు వారికి ఉన్నాయా, వారికి వాహనాలు ఏమైన ఉన్నాయా, ఎన్నిరకాల వాహనాలు ఉన్నాయి అన్న వివరాలు ప్రశ్నిస్తారు.
అలాగే ఇళ్లలో విద్యుత్ ఉందా, సోలార్ లైటింగ్ ఉపయోగిస్తున్నారా. మరుగుదొడ్లు ఉంటే, ఎలాంటి రకం, డ్రైనేజి సిస్టమ్ ఉందా, వంటగది ఉందా. ఎల్ పిజి ఉపయోగిస్తున్నారా.. లేక పిఎన్ జినా, వంట కోసం ప్రధాన ఇంధనం ఏమిటి వంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. జనాభాగణన సిబ్బంది ఇళ్లలో టీవీ ఉందా, రేడియో, ట్రాన్సిస్టర్‌లు ఉన్నాయా, ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఉన్నాయా, బైసైకిల్, మోటర్ సైకిల్, స్కూటర్ ల వివరాలు, కారు జీపు వ్యాన్‌ల వివరాలు అడుగుతారు. జనాభా లెక్కల అధికారులు తమకు కేటాయించిన స్థానిక ప్రదేశాలలో పౌరులనుంచి జాబితాలో పేర్కొన్న 33 ప్రశ్నలను అడగవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.