Reading Time: < 1 minute

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేగింది. తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో సిఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. తెలిసిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌కు చెందిన నాథూరామ్ తిరుపతిలో దైవదర్శనం చేసు కుని శంషాబాద్ మీదుగా తన స్వస్థలానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతని లగేజీ తనిఖీ చేయగా అందులో ఒక బుల్లెట్ లభ్యమైంది. సిఐఎస్‌ఎఫ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. నాథూరామ్‌కు లైసెన్సు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. అతడు లగేజీలో ఉన్న దుస్తుల్లో బుల్లెట్‌ను పొరపాటున తీసుకొచ్చినట్లు గుర్తించారు ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులో కొద్ది సేపు కలకలం నెలకొంది.

గతేడాది అక్టోబర్‌లోనూ కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. ఆ ప్రయాణి కుడిని విశాల్‌గా గుర్తించారు. అతడి బ్యాగ్‌లో 38 ఎంఎం బుల్లెట్ లభ్యమైంది. విశాల్‌ను అదుపులోకి తీసుకున్న సెక్యూరి టీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. వివిధ దేశాలు, రాష్ట్రా లకు వెళ్లే సాధారణ ప్రయాణికులు, వీఐపీలు ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుంటారు. తనిఖీల సందర్బంగా డ్రగ్స్, బంగారం, ఆయుధాలు బయటపడుతూ ఉంటాయి.