Reading Time: < 1 minute

రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, బిఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ కమిషనర్ వి.సి సజ్జనార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో ఏడు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని సిట్ అధికారిగా ఎలా నియమిస్తారంటూ సిట్ చీఫ్‌గా ఉన్న తనపై ఆరోపణలు చేసినందుకు గాను అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను నోటీసులు అందిన రెండు రోజుల్లోపు ఇవ్వాలని కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యంగా, తప్పుదారి పట్టించే విధంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నాయన్నారు. ఆరోపణలన్నీ కేవలం ప్రచారం కోసమే చేశారని, ఇవి సిట్, అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆధారాలు అందచేయడంలో విఫలమయితే చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.