
డిఫెండింగ్ ఛాంపియన్‌గా అండర్-19 ప్రపంచక్ప బరలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఇప్పటికే ఐర్లాండ్, జపాన్‌పై విజయాలు సాధించిన ఆస్ట్రేలియా శుక్రవారం శ్రీలంకతో తగలపడుతోంది, ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ విల్ బైరోమ్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. బైరోమ్‌తో పాటు లచ్‌మండ్, కెసి బార్టన్ తలో రెండు, ష్కిల్లర్ 1 వికెట్ తీశారు. దీంతో శ్రీలకం 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సులభంగా చేధించింది. 12 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బైరోమ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.