
టీం ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ టి-20 ఫార్మాట్‌లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో నెం.1 ర్యాంకులో ఉన్న అభిషేక్.. నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి-20లో చెలరేగిపోయాడు. 35 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా అభిషేక్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా అభిషేక్‌ని ప్రశంసిచారు.
‘టి20ల్లో అభిషేక్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే.. ప్రతి బాల్‌ను సిక్స్ బాదాలని చూడటం లేదు. తెలివైన క్రికెట్ ఆడుతున్నాడు. తన ఎత్తును సద్వినియోగం చేసుకొని బంతిని బౌండరీ అవతలకు తరలిస్తున్నాడు. ఇతర భారత క్రికెటర్లకు, అతడికి చాలా వ్యత్యాసం ఉంది. అభిషేక్ హాఫ్ సెంచరీ చేస్తే.. ఆ మ్యాచ్‌లో తప్పకుండా టీం ఇండియా విజయం సాధిస్తుంది. భఆరత జట్టు కూడా 200 పరుగులు చేస్తుంది. టి-20 ఫార్మాట్‌లో టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ బాగుంది. టాప్ ఆర్డర్‌లో ప్రతి ఒక్కరూ పరుగులు రాబట్టగలరు’’ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నారు.