
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, వ్యక్తిగత హననం చేస్తున్నారని కెటిఆర్ అనడం హాస్యాస్పదం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష ఉంటే అధికారంలోకి రాగానే చర్యలుండేవని, ఫోన్ ట్యాపింగ్.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని చెప్పారు. ఆరోపణలు చేసి పారిపోతామంటే కుదరదని సూచించారు. అలీబాబా 420 దొంగల మాదిరి మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం దోపిడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను చెల్లెలుగా ఎప్పుడూ గౌరవిస్తానని, వాటాల పంపకాల్లో తేడా వల్లే కెసిఆర్ కుటుంబంలో గొడవలు అని తెలియజేశారు. ఇప్పటికైనా కవిత నిజాలు మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నానని, ఎఐసిసి ఇన్ చార్జ్ మార్పు ఉండదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.