Reading Time: < 1 minute

అంతరక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్‌ని నటుడు ప్రకాశ్ రాజ్ కలిశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌ వీరిద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ సునీతాతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం రావడం మరచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సునీత మాట్లాడుతూ.. అంతరిక్ష అనుభవాలు గురించి తెలిపారు. అంతేకాక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. అంతరిక్ష కేంద్రంలో నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. అక్కడ ప్రతి రోజూ కొత్తగా ఉంటుందని తెలిపారు. కల్పనా చావ్లాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.