
హైదరాబాద్: తెలంగాణను దోచుకున్న దొంగలు.. బిఆర్ఎస్ నేతలు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలే కవిత దోచుకున్నారని, ఇప్పుడు కెసిఆర్, కెటిఆర్, హరీష్ లు చెలరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. మీ మీద వస్తున్న ఆరోపణలు నాటి హోం మంత్రిపై ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. ఆనాడు మంత్రివర్గాన్ని ఒక డమ్మీ కేబినెట్ గా నడిపించారని, సిఎం రేవంత్ రెడ్డి కేబినెట్ పై అవాకులు.. చెవాకులు మాట్లాడితే ఊరుకోమని అద్దంకి హెచ్చరించారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని అన్నారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. కక్ష సాధించాలంటే ప్రభుత్వానికి రెండేళ్లు ఆగాల్సిన పనిలేదని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.