Reading Time: < 1 minute

కోల్‌కతా: టి-20 ప్రపంచకప్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సారి భారత్, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే టోర్నమెంట్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే గురువారం ఐసిసి, బిసిసిఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంను సందర్శించాయి. స్టేడియంలోని సౌకర్యాలు, పిచ్‌ను పరిశీలించి సంతృప్తికరం అనే రేటింగ్‌ను ఇచ్చాయి. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) వెల్లడించింది.

‘‘ఐసిసి అధికారుల బృందం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించింది. కార్పొరేట్ బాక్స్‌లను పరిశీలించి సౌకర్యాలపై ఆనందం వ్యక్తం చేసింద.ి మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ఐసిసి ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని క్యాబ్ పేర్కొంది. టి-20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గ్రూప్ స్టేజీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. మూడు ప్రారంభ మ్యాచుల్లో.. ఒక టి-20 ఈ మైదానం వేదిగానే జరగనుంది. పాకిస్థాన్ మ్యాచులు శ్రీలంకలో జరగనున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఫలితాల ఆధారంగా.. సూపర్ 8, సెమీఫైనల్ మ్యాచులు సైతం ఈ మైదానంలోనే నిర్వహించే అవకాశం ఉంది.