Reading Time: < 1 minute

తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన ‘గొల్ల రామవ్వ’ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని… ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను… సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై… రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతోపాటు… సాహిత్యం సమకూర్చడం విశేషం. ‘గొల్ల రామవ్వ’ ఈనెల 25 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో పి.వి.నరసింహారావు తనయులు పి.వి.ప్రభాకరరావు, తనయ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, రాజీవ్ కనకాల, యాటా సత్యనారాయణ, ఉదయభాస్కర్ పాల్గొని… చిత్ర దర్శకుడు ముళ్ళపూడి వరా, నిర్మాతలు రామ్ విశ్వాస్ హనూర్కార్, రాఘవేంద్రవర్మలను అభినందించారు.